నిమ్స్ ఆస్ప‌త్రిలో దారుణం.

0

నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మ‌హేశ్వ‌రి అనే రోగికి అప‌రేష‌న్ చేసిన‌ అనంత‌రం క‌త్తెరను క‌డుపులోనే వ‌దిలేసి కుట్లేశారు ఆస్ప‌త్రి వైద్యులు. ఆపరేషన్ తర్వాత నొప్పి తగ్గకుండా వస్తుండటంతో ఆందోళన చెందిన మహేశ్వరి తిరిగి ఆస్పత్రికి చేరుకుని విషయాన్ని వైద్యులకు తెలియజేసింది.

ఎంతకీ నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూశారు. దాంతో మహిళ కడుపులో కత్తెర మరిచిపోయిన విషయం బయటపడింది. ఖంగు తిన్న డాక్టర్లు వెంటనే మరోసారి మహేశ్వరిని ఆపరేషన్ చేసి కత్తెర తీసే పనిలో పడ్డారు. అయితే విషయం తెలిసిన రోగి బంధువులు వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిమ్స్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.