అంతర్ రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు

0

హైదరాబాద్ నగరంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ డీసీపీ విశ్వప్రసాద్ మరియు ఏసీపి నరసింహ రెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు.

ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నర్సుల్ అన్సారి , ఎండి జలీల్ అన్సారీ లు గత నాలుగు నెలలుగా హైదరాబాద్ చిక్కడపల్లి, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిదిలలో ఇళ్ల తాళాలు పగల గొట్టి పలు దొంగతనాలుకు పాల్పడినట్లు వెల్లడించారు. కాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిపై జార్ఖండ్ లో కూడా కేసులు ఉన్నట్లు తెలిపారు.

ప్రత్యేక బృందాలతో చిక్కడపల్లి క్రైం పోలీసులు నిఘా ఉంచి వీరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 12లక్షల 50 వేల విలువ చేసే 32 తులాల బంగారం మూడున్నర కిలోల వెండి ఆభరణాలను , ఒక ఐ పాడ్, రెండు మొబైల్ ఫోన్లు, మూడు ఖరీదైన వాచ్ లను స్వాధీనం చేసుకొని చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.