విలవిలలాడుతున్న కామారెడ్డి

9
telugu states sunmmer.
telugu states sunmmer.

ఎండాకాలం మొదలై రోజులు గడుస్తుండటంతో భానుడి భగభగలు పెరుగుతున్నాయి.రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు జిల్లా ప్రజలను ఉక్కపోతకు గురిచేస్తున్నాయి.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండల తీవ్రత కొనసాగుతోంది.జిల్లా మొత్తం వేడిగాలు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.ఎన్నడు చూడని ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.

ప్రజలు ఉదయం 11 గంటల లోపే అన్ని పనులు పూర్తి చేసుకుని ఇళ్ల నుండి బయటకు రావడం మానేయడంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.ఎండల దాటికి విద్యుత్ వినియోగం పెరగడంతో ట్రాన్స్ ఫార్మర్లు సైతం తరచుగా ట్రిప్ అవుతున్నాయి..దీంతో ప్రజలు అటూ ఇంట్లో ఉండలేక ఇటు బయటకు రాలేక ఉక్కపోతతో విలవిలలాడుతున్నారు.విద్యుత్ డిస్కంల పై విపరీతంగా లోడ్ పెరగడంతో పలు చోట్ల అధికారులు కోతలను విధిస్తున్నారు.