నీటికి కట కట – అలమటిస్తున్న కామారెడ్డి.. 

14
telangana state, mishan kakathiya.
telangana state, mishan kakathiya.

ఒక వైపు తీవ్రమైన ఎండలు ప్రజలను హడలెత్తిస్తుంటే..సదరు జిల్లాకు చెందిన వివిధ గ్రామాల ప్రజలో నీటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.వివిధ ప్రాజెక్టుల్లో ని నీటిని మోటర్లతో తోడుకుంటుండటంతో జలాశయాల్లోని నీరు సైతం అడుగంటి పోయింది.కనీస అవసరాలకు సైతం నీరు లేని పరిస్థితుల్లో కొన్ని గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయి.

కనీస అవసరాలకు సైతం నీరు దొరక్కపోవడంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఏజన్సీ గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది..గతంలో ఇష్టం వచ్చినట్టు మోటార్లతో నీటిని తోడేయడంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.ట్యాంకర్ల వెలుసుబాటు కూడా లేకపోవడంతో కాలినడకన దూరప్రాంతాలకు వెళ్లి నీటి కుంటల్లోని మురికి నీటిని తోడుకుని వాడుకోవాల్సిన పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నారు.ఇదే సమయంలో అక్రమార్కులు నీటీ దందాను నిర్వహిస్తున్నారు.

మిషన్ కాకతీయ పనులతో చెరువుల్లో పూడికలు తీసిన ప్రయోజనం లేకపోయింది.ఎండ వేటికి చాలా ప్రాంతాల్లో భూగర్భజలాలు సైతం అడుగంటి పోయాయి.మిషన్ భగీరథ పనులు సైతం ఇంకా పూర్తి కాకపోవడంతో దాని ప్రయోజనాలు ఇంకా ప్రజలను చేరలేదు.30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నిజాం సాగర్ పూడికతో నిండిపోవడంతో దాని సామర్థ్యం 17.8 టీఎంసీలకు పడిపోయింది.కారణాలు ఏవైన సరైన ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్టు నీటిని వాడుకోవడమే ఈ సమస్యకు అసలు కారణం.