తెలంగాణ బీజేపీతో పొత్తు పెట్టుకున్న కొత్త పార్టీ… !

83
Telangana new party to tie up with BJP!
Telangana new party to tie up with BJP!

తెలంగాణలో ఎన్నికలు సమీపీస్తుండటంతో రాజకీయాలు మారిపోతునే ఉన్నాయి.. నిన్న మహా కూటమిలో ఒక పార్టీ చేరగా నేడు.. బీజేపీతో పొత్తుకు సిదందమైంది మరో నూతన పార్టీ.. ఇది ఇలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రం స్వతంత్రంగా తామే గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.. ఏది ఎమైనప్పటికి నామినేషన్ డేటు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాల్లో మాత్రం జాలీయ పార్టీల నాయకులు పావులు కదుపుతూనే ఉన్నారని చెప్పవచ్చు..

తెలంగాణ భారతీయ జనతా పార్టీతో కతిసి పోటిచేయడానికి “యువ తెలంగాణ పార్టీ” ముందుకు వచ్చింది.. ఈ సందర్బంగా టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అక్ష్మణ్ మాట్లాడుతూ… బీజేపీతో కలసి పోటీ చేయాలని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కాగా చరో రెండు మూడు రోజుల్లో సీట్ల సర్ధుబాటు చేసుకొని ఎవరు ఎక్కడ నుండి పోటి చేస్తారనే అంశాన్ని స్పష్టం చేస్తానని ఆయన తెలిపారు..

మహాకూటిమికి ప్రజలలో ఆదరణ లేదని అది కేవలం కూటమిగానే మిగిలిపోతుందని ఆయన అన్నారు.. ఇక 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏగతిపట్టిందో ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే గతిపడుతుందని ఆయన జోష్యం చెప్పారు.. ఇక తెలంగాణ లో కేంద్ర పార్టీ ఇచ్చిన పథకాలను, హామీలను కేసీఆర్ విస్మరిస్తోందని ప్రజలకు ఎవరు ఎంచేశారన్నది స్పష్టంగా తెలుసని అన్నారు.. ఎన్నికల తరువాత టీఆర్ ఉనికి తెలంగాణలో కనపడదని ఆయన అన్నారు..