నిజామాబాద్ లో ఘనంగా నిర్వహించిన వివేకానంద జయంతి వేడుకలు..

0

స్వామి వివేకానంద జయంతి వేడుకలను నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వివేకానంద 156వ జయంతి సందర్బంగా నగరంలోని గాజుల్ పేట్ లో గల వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు బిజేపి నాయకులు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నగర మేయర్ ఆకుల లలిత మాట్లాడుతూ స్వామి వివేకా నంద గారు తెలియని వ్యక్తులు వుండరని, ఆయన దేశం కోసం ధర్మం ఎంతో కృషి చేశారని, దేశ ప్రతిష్టతను ప్రపంచం నలుమూలలా చాటిన వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. స్వామి వివేకానంద చెప్పిన విషయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని, ముఖ్యంగా యువత ఆయన అడుగుజాడలలో నడువాలని కోరారు.