ముగిసిన పోలీస్ దేహ దారుడ్య పరీక్షలు

8
telangana police recrutement.
telangana police recrutement.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11న ప్రారంభమైన పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు ఈ రోజు ముగిశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.

సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎలాంటి అవ‌క‌త‌వ‌కలు జ‌ర‌గ‌కుండా ఈవెంట్స్ నిర్వహించామ‌ని అధికారులు తెలిపారు. ప్రతి రోజు సుమారు 1000 మంది అభ్యర్థుల చొప్పున దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కాగా, బయోమెట్రిక్ ద్వారా వారి పేర్లు న మోదు చేయడంతో పాటు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించిన అనంతరం అభ్యర్థులను పరీక్షలకు అనుమతించిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు