కేసీఆరే ” తెలంగాణ భవిష్యత్.”.! ఇవిగో ఆయన విజయాలు..!!

129
telangana,politics ,trs party,kcr.
telangana,politics ,trs party,kcr.

కేసీఆర్ ఉద్యమకారునిగా, ఒక నాయకునిగా, ఒక ముఖ్యమంత్రిగా, అసాధారణమైన మేధోసంపత్తి కలిగిననేత. కేసీఆర్ వంటి ఒక బలమైన నాయకుడు రాకపోయి ఉంటే అటు చంద్రబాబు, ఇటు కాంగ్రెస్ కొత్తరాష్ట్రాన్ని మళ్లీ ఏపీలో కలిపి ఉండేవారు. తెలంగాణ రాష్ట్రము ఆరు దశాబ్దాల్లో బాగా నష్టపోయింది, అష్టకష్టాలపాలయింది, అప్పుల పాలయింది, సాగునీరు, తాగునీరు, కరెంటు లేకనే ఇబ్బంది పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కరెంటు విషయం పరిష్కరించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సమస్య తలెత్తలేదు. అంతేకాదు పాత విద్యుదుత్పత్తి కేంద్రాల ఉత్పాదన సామర్థ్యం పెంచారు.

తెలంగాణలో రైతులు సాగునీరు లేక బోర్లు వేసీ వేసీ అప్పుల పాలయి పంటలు చేతికి రాక చాల నష్టపోయారు . కాలువల్లో నీరు లేదు. బావులు ఎప్పుడో ఎండిపోయాయి. చెరువులు పూడుకుపోయాయి. ఒక్క రైతు ఒక్కోసారి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఎకరా పారించడం కష్టం అవుతున్నది. తెలంగాణ రైతులు భూగర్భ జలాలకోసం ఏటా 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రైతుకు నీళ్లివ్వగలిగితే ఆ 25 వేల కోట్లు తెలంగాణకు మిగులు. రైతుకు మిగులు. తెలంగాణ వెనుకబాటుకు ప్రధాన కారణం అదే. గతంలో వేల కోట్ల రూపాయలను మట్టిలో పోశారు. పదేళ్ల తర్వాత కూడా ఒక్క చుక్క నీరు పారలేదు. తెలంగాణకు గరిష్ట ప్రయోజనంకలిగేవిధంగాప్రాజెక్టులు రూపకల్పన చేయాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష .. తెలంగాణ రాగానే శాశ్వత ప్రాతిపదికన నీటి వనరుల పునరుద్ధరణ దిశగా ప్రభుత్వం అడుగులువేసింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ  ప్రారంభించింది. ఇవి రెండు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి..

కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసులను గెల్చుకున్నారు. ఉద్యమ నేతలో గొప్పగా ప్రభుత్వాధినేతను కేసీఆర్‌లో కొత్తగా చూసిన ఒక ఆశ్చర్యం,సంబరం. తాగునీటి, సాగునీటి సమస్య నుంచి తెలంగాణను విముక్తి చేయలగలరన్న నమ్మకం ఇప్పుడు అందరిలోనూ కలిగించారు. కొత్త ఆశయాలు, లక్ష్యాలతో ప్రారంభించిన తెలంగాణ పయనం.. కేసీఆర్ నేతృత్వం లో ఉదృతంగా సాగుతుంది. సంక్షేమ వర్గాల సంక్షేమంతో… దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే తెలంగాణను మొదటి స్థానం లో ఉంచుతుంది ..