ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. : ఏఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్

0

భద్రాచలం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అతిక్రమించి వాహనాలు నడిపితే ఇకపై ఈ-చాలానా మరియు పాయింట్స్ జారిచేయటం జరుగుతుంది అని వెల్లడించారు. వాహనచోధకులు అందరు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని తెలిపారు..

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలకు ఈ-చాలానా మరియు పాయింట్స్ జారిచేయటం పై అవగాహ కలిగించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు భద్రాచలం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.