ఆర్ ఆర్ ఆర్ ” ప్రాజెక్ట్ ఎలా మొద‌లైందంటే

116

దర్శకధీరుడు రాజమౌళి తాను తెరకెక్కిస్తున్న ‘RRR’పై ఉన్న అనుమానాలన్నింటికీ చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. నేడు ఆయన తన సినిమాలోని హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రాజమౌళి కథతో పాటు నటీనటుల గురించి, అలాగే ఎన్టీఆర్, చెర్రీ క్యారెక్టర్ల గురించి వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి హీరో రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ

ఎన్టీఆర్ తో క‌లిసి ప‌నిచేస్తాన‌ని తాను అనుకోలేద‌ని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ఎలా మొదలైందన్నది చెప్పాల‌ని ఉందంటూ ఆరోజు జ‌రిగిన కొన్నిజ్ఞాప‌కాల్ని నెమ‌రువేసుకున్నారు.ఒకరోజు తన‌ని రాజ‌మౌళి ఇంటికి ర‌మ్మ‌న‌మ‌న్నాడ‌ని వెళితే..తారక్‌ కింద నేల మీద రిలాక్స్‌ అయి ఓ మంచి ఫోజ్ లో కూర్చున్నార‌ని అన్నారు. తారక్‌కు నేనొస్తానని తెలీదు. నాకూ తనొస్తాడని తెలీదు. అలా ఇద్దరం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా మా ఇద్దర్నీ లోపలికి తీసుకెళ్లిన రాజ‌మౌళి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ గురించి చెప్పార‌ని చ‌ర‌ణ్ గుర్తు చేసుకున్నారు. అద్బుతమైన, గౌరవప్రధానమైన పాత్రల్లో నటిస్తున్న‌ట్లు, అందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రామ్ చ‌ర‌ణ్ చెప్పాడు.