గెలిచిన వారంతా వారి గౌర‌వాన్ని కాపాడుకోవాలి

0

ఇటీవ‌ల జ‌రిగిన పంచాయితీ ఎన్నిక‌ల్లో గెలిచిన స‌ర్పంచులు , వార్డు మెంబ‌ర్లు చాక‌చ‌క్యంతో వ్య‌వ‌హరించాల‌ని ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. జ‌న‌గాంలోని పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన నూత‌నంగా ఎన్నికైన స‌ర్పంచుల అభినంద‌న స‌భ లో పాల్గోన్న ఆయ‌న..గెలిచిన అభ్య‌ర్ధులు ఎవ‌రైనా స‌రే.. అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ‌కుండా. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప‌నులు చేయాల‌ని అన్నారు. త‌మ గౌర‌వాన్ని కాపాడుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. అధికారం చేతిలో ఉంద‌ని అహంకారంతో విర్ర‌వీగితే ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెబుతార‌ని హెచ్చ‌రించారు.