ఎంపీ అభ్యర్ధుల్లో కొత్తవారికి చాన్స్ ఇచ్చిన కేసీఆర్

0

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో… తెలంగాణ లోక్ సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ పడే అభ్యర్థులను అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ జాబితాలో ముగ్గురు సిట్టింగ్ క్యాండిడేట్ లకు ఈ సారి టికెట్ ఇవ్వలేమని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్ లకు ఈ దఫా టికెట్ ఇవ్వడంలేదని స్వయంగా కేసీఆరే వారికి చెప్పినట్టు సమాచారం …

ఇక ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పొంగులేటి….. గెలిచిన తర్వాత తరువాత పార్టీమారి టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన నామా నాగేశ్వరరావుకు ఇవ్వనున్నారని తెలుస్తుంది… చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అక్కడి నుంచి పోటీకి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ సారి టీఆర్ఎస్ ఎంపీ స్థానల అభ్యర్థుల జాబితాలో సగం మంది కొత్తవారే ఉండటం విశేషం….