మ‌మ్మ‌ల్ని గెలిపిస్తే సైనికుల్లా పార్ల‌మెంట్ లో ఉంటాం

11
trs party mp kavitha.
trs party mp kavitha.

తెలంగాణ సాధించుకోవడం కోసం కేసీఆర్ ఎంత చిత్తశుద్దితో పని చేశారో.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అంతే చిత్తశుద్ధితో టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రంతో పోరాడి సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు నిజామాబాద్ ఎంపీ క‌విత‌. . 16 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులను, ఒక ఎంఐఎం అభ్యర్థిని గెలిపిస్తే 17 మంది సైనికులం పార్లమెంట్‌లో ఉంటామని అన్నారు.

నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆమె మాట్ల‌డుతూ మార్చి 19వ తేదీన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నామని, ఆ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గం పరిధిలోని లక్షలాది మంది తరలివచ్చి.. విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్‌కు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడే అవకాశం ఉంది. కనుక ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు.