కవిత నామినేషన్ కు ముహూర్తం ఖరారు

0

నేడు నిజామాబాద్ జిల్లా నియోజకవర్గం టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్బంగా సారంగాపూర్ లోని హనుమాన్ దేవాలయంలో ఎంపీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం రెండు గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పాత్రలను అందించనున్నారు. ఆతరువాత సాయంత్రం 6:30 గంటలకు మాక్లూర్ మండలం మాణిక్ భండార్ లో రోడ్ షో తో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.