టీఆరెస్ లోకి కొనసాగుతున్న వలసల పరంపర

22
telangana, congress mla he joined trs party.
telangana, congress mla he joined trs party.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష పార్టీలను అధికార టీఆర్ఎస్ చావుదెబ్బ తీసింది. మొత్తం 119 స్థానాలకు గానూ 88 చోట్ల ఘనవిజయం సాధించి విజయదుందుభి మోగించింది. ఇక తమ రాజకీయ భవిష్యత్తు కోసం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు ఎక్కేందుకు రంగం సిద్ధమయింది. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు.

అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తాను టీఆర్ఎస్ లో చేరుతానని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. అనుచరులు, కార్యకర్తలు, మద్దతుదారుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు