ఆసక్తి రేపుతున్న పులిజూదం ట్రైలర్‌

0

ప్రముఖ మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌. విశాల్‌, శ్రీకాంత్‌, మోహన్‌లాల్‌, హన్సిక, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పులిజూదం’. ఉన్నికృష్ణన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్ . మోహన్‌లాల్‌ పోరాట సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది.

ఇందులో మోహన్‌లాల్‌ పోలీస్‌ అధికారిగా, రాశీ ఖన్నా పోలీస్‌ కానిస్టేబుల్‌గా, హన్సిక బార్‌ డ్యాన్సర్‌గా, విశాల్‌ వైద్యుడిగా, శ్రీకాంత్‌ ప్రతినాయకుడిగా నటించారు. ‘తప్పు చేస్తే భయపడాలి. భయపడతారు. ఎందుకంటే ఆ భయానికి రెండో పేరుంది. డా. మదనగోపాల్‌’ అని విశాల్‌ చెబుతున్న డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్‌ చివర్లో మోహన్‌లాల్‌, శ్రీకాంత్‌ ఫైటింగ్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాక్‌లైన్‌ వెంకటేశ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ మల్టీస్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మార్చి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.