తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతిసంబరాలు

0

విజయగనరంలో అప్పుడే సంక్రాంతి సంబరాలు అదరహో అనిపిస్తున్నాయి. తెలుగు దనాన్ని ఉట్టిపడే రీతిలో నగరంలో ప్రైవేట్ విద్యాసంస్ధలు అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరం యువతకు తెలిసేలా ఏర్పాటు చేసిన పలు పౌరాణిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ సందర్బంగా విద్యార్ధుల సాంప్రదాయ వస్త్రధారణ చూడముచ్చట గొలిపింది.పట్టు పరికిణీలో విద్యార్ధులు సందడి చేస్తూ, ఆట పాటలతో విద్యార్థులు చేసిన నృత్యాలు అబ్బురపరిచాయి. హరిదాసు వేషదారణ చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.