సీఆర్ గారు మమ్మల్ని మాతృదేశానికి చేర్చండి….

5

బ్రతుకుదెరువుకోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణకు చెందిన 12 మంది ఇరాన్ దేశంలో చిక్కుకు పోయారు. వీరు నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల జిల్లాల చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది. “ఇవ్వనీ ఆల్ మసారియా” అనే సంస్థలో ఉద్యోగంలో చేరిన వీళ్లకు సంస్థ ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని.. గట్టిగా అడిగితే గన్ తీసుకోని కాల్చిపడేస్తాం అంటూ బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమను కాపాడాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ కు తెలిపామని; గతంలో కేటీఆర్ ఇరాన్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు తమ గోడు వినిపించామని వారి బాధను వీడియో తీసి సామజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. తమకు రావలసిన జీతం ఇప్పించి తమను మాతృదేశానికి చేర్చాలని వేడుకున్నారు. తినడానికి తిండి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమనసు చేసుకొని తమను రక్షించాలని నాయకులను వేడుకుంటున్నారు.