దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రశంసించిన మెగాస్టార్

479
The best Chief Minister in the country is KCR .. appreciated megastar
The best Chief Minister in the country is KCR .. appreciated megastar

సంతోషం సినిమా అవార్డు కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశంసించారు.. మనదేశంతోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.. అనంతరం హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ ఇన్ని హంగుతలో ఉందంటే అందుకు కారణం సీఎం కేసీఆర్ అని చెప్పారు.. నిజంగానే కేసీఆర్ ఒక సర్వేలో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారని తెలిపారు.. “కేసీఆర్ మాటల ముఖ్యమంత్రి కాదని, చేతుల ముఖ్యమంత్రని” ఆయన పని ఆయన చేసుకుంటు వెలతారని అందుకే ఇంత అరుదైన గౌరవం దక్కిందని అన్నారు..

నేను కేసీఆర్ కలిసింది కేవలం ఒకే ఒక్కసారని కలినప్పుడు కూడా హైదరాబాదులో చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందేందుకు ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ చెప్పారని చిరంజీవి అన్నారు. చిత్ర పరిశ్రలో ఓ సీనియర్ నటుడిగా ఇంకా ఏమైనా లోటు పాట్లు ఉంటే తప్పకుండా వాటిని పూర్తి చేస్తానని చెప్పాడని చిరు తెలిపారు.. సినీ పరిశ్రమపై ఆయనకున్న మక్కువకు ఇది నిదర్శనమని… చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపాలని కేసీఆర్ భావిస్తుడటం ఇండస్ట్రీ అదృష్టమని మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాటను బయట పెట్టారు.. ఇలాంటి ముఖ్యంత్రులు ఉన్నంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు ఎలాంటి నష్టం ఉండదని చిరు సభ ముఖంగా తెలిపారు..