గజ్వేల్‌లో వంటేరుకు పక్కలో బల్లెం

301
The giant on the side of the vanter in Gajevel
The giant on the side of the vanter in Gajevel

నిన్నమొన్నటిదాకా గెలుపు తనదే అని విర్రవీగుతున్న కాంగ్రెస్‌ నేత, గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై బరిలోకి దిగుతోన్న వంటేరు ప్రతాపరెడ్డికి తాజాగా పక్కలో బల్లెం వచ్చి చేరుతోంది.. కనీసం డిపాజిట్‌ దక్కించుకొని పరువు కాపాడుదామనుకుంటున్న ఆయనకు తెలంగాణ యుద్ధనౌక గద్దర్‌ రూపంలో సంచలన షాక్‌ తగలబోతోంది.

గజ్వేల్‌లో నాలుగు ఓట్లు దక్కించుకోవడానికి వారం రోజులుగా వంటేరు పడుతున్న పాట్లు, పచ్చ మీడియాతో కలిసి వండుతున్న వంటలు అన్నీ ఇన్నీ కావు. కేసీఆర్‌ కుటుంబంలోనే చిచ్చుపెట్టి లబ్ది పొందాలని చూశాడు ఈ ప్రబుద్ధుడు. హరీష్‌ రావు గజ్వేల్‌ నియోజకవర్గంలో మామ కేసీఆర్‌ గెలుపు కోసం అడుగు పెట్టాడో లేదో వంటేరుకు మంట పుట్టింది. కాలు కాలిన పిల్లిలా చిందులు తొక్కడం మొదలుపెట్టాడు. ఆ ఆగ్రహంలో ఆవేశంలో సంయమనం, మెంటల్‌ బ్యాలెన్స్‌ కోల్పోయిన ఆయన నాలుగు సంచలన వ్యాఖ్యలు చేశాడు.. కాంగ్రెస్‌తో హరీష్‌ రావు టచ్‌లో ఉన్నాడని ఒకసారి, తాను హరీష్‌ని పర్సనల్‌గా కలిశానని, మా మధ్య చాటింగ్‌ కూడా నడిచిందని చెప్పుకొచ్చాడు. ఇదంతా కేసీఆర్‌-హరీష్‌ మధ్య కుట్ర పెట్టే వ్యవహారం అని చిన్న పిల్లాడినా అడిగినా చెబుతాడు.

80లనాటి ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌కి పడేది లేదంటూ వంటేరు వ్యాఖ్యలను లైట్‌ తీసుకుంది టీఆర్‌ఎస్‌. మీడియా అడిగిన ఒకటీ రెండు ప్రశ్నలను కొట్టిపారేశారు అటు కేటీఆర్‌, ఇటు హరీష్‌. మూలిగే నక్కపై తాటిపండులా కనీసం డిపాజిట్‌ దక్కుతుందనే ఆలోచనలో వంటేరు ఉండగా, తాజాగా కేసీఆర్‌కి పోటీగా తాను పోటీ చేస్తానంటూ ముందుకు వచ్చాడు గద్దర్‌. ఇంకేముంది, కేసీఆర్‌పై ఉన్న నాలుగు వ్యతిరేక ఓట్లలో రెండు వంటేరుకు, రెండు గద్దర్‌కి పడడం ఖాయం. దీంతో, ఇద్దరికీ డిపాజిట్‌లు దక్కవు. ఇలా, తాను పడుతున్న పాట్లని గద్దర్‌ చెదరగొడుతుండడంతో వంటేరుకి దిక్కు తోచడం లేదట.. మరి, ఇప్పుడు వంటేరు గతి ఏం అవుతుందో చూడాలి..