ఆలయంలో మిస్టరీ.. వేసవిలో నీరు, వానాకాలంలో మాయం

27
The Unique and Stunning Temple ,The Jagannath Monsoon temple, Bithorgarh

మంచి వేసవిలో సూర్యుడు నిప్పులు కక్కుతుంటే ఆ గుడిలో నీటి తుంపరలు వెల్లువెత్తుతాయి. అదే వర్షాకాలం మొదలైందంటే ఇక నీటి తుంపరలు వాటంతట అవే ఆగిపోతాయి. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో ఉన్న అతి పురాతనమైన జగన్నాథ మందిరంలో ఈ వింత జరుగుతోంది.

The Unique and Stunning Temple  ,The Jagannath Monsoon temple, Bithorgarh

వానాకాలం మరో పది రోజుల్లో మొదలువుతుందనగా నీటి తుంపరలు పై కప్పు నుంచి పడుతుంటాయి. అది చూసిన తర్వాతే స్థానికులు పొలం పనులు ప్రారంభిస్తారు. వర్షాలు మొదలవుతాయని అదే వారికి సూచనగా భావిస్తారు. వర్షాకాలం మొదలవగానే ఈ తుంపరలు మాయమైపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందన్నది నేటికీ మిస్టరీగానే ఉండిపోయింది. చాలా మంది సైంటిస్టులు దీనిపై పరిశోధనలు జరిపినా, వారికేమీ ఫలితాలు లభించలేదు. 11వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయంలో, అసలు ఏ విధంగా ఈ ఏర్పాటు చేశారన్నది వింతే మరి!