మల్లకంబ క్రీడ అవలంబిస్తున్న ఆదాశ‌ర్మ‌

0

హార్ట్ ఎటాక్ చిత్రం తో కథానాయిక గా పరిచయమయింది ఆదా శర్మ. ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే అదా తాజాగా ట్విట్టర్ లో ఒక వీడియో ని అప్లోడ్ చేసింది. ఆ వీడియో లో ఆదా తాడు సహాయంతో పైకి ఎక్కి మల్లకంబ చేస్తూ ఉంది.

ఇప్పుడు ఈ వీడియో హల్చల్ చేస్తుంది. ఈ వీడియాని అప్ లోడ్ చేస్తూ ఒలింపిక్‌ క్రీడల్లో జత కాబోతున్నానని , ఫిబ్రవరి 16, 17న ముంబయిలో శివాజీపార్కు వద్ద జరిగే తొలి మల్లకంబ ఛాంపియన్‌ షిప్‌ పోటీలలో పాల్గొంటున్న అని ఆదా శర్మ ట్వీట్ చేసింది. అదా మల్లకంబ నైపుణ్యం చూసిన అభిమానులు మరియు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆదా తెలుగులో ‘కల్కి’ చిత్రంలో ముఖ్య పాత్ర చేస్తుంది… మరోపక్క హిందీలో ‘కమాండో 3’, ‘బైపాస్‌ రోడ్‌’ సినిమాల్లో నటిస్తుంది.