ఆర్జీవీకి దిమ్మతిరిగే షాక్. చంద్రోదయం నుండి పాట విడుదల

0

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రం నుండి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యంన్త్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని వెన్నుపోటు పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పాటకు కౌంటర్ ఇస్తూ చంద్రబాబు బయోపిక్ గా వస్తున్న చిత్రం “చంద్రోదయం” నుండి ‘వెన్నుపోటు అని వాగే వాజమ్మలు” అనే పాటను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని మోహన శ్రీజ మరియు శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై వెంకట రమణ స్వీయ దర్శత్వంలో రూపొందుతోంది.

ఈ చిత్రం రానున్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు మైలేజ్ పెంచేదిగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే ఎన్నికల హంగామ కనిపిస్తున్నప్పటికి కూడా బయోపిక్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పవచ్చు..