ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ 3 బ్యానర్ లో నూతన చిత్రం పూజాకార్యక్రమాలు ..

0

ఈస్ట్ కోస్ట్ ప్రోడక్షన్ నెంబర్ 3 బ్యానర్ పై హీరోయిన్ ఓరియంటెడ్ లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్ కోేగిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం పూజాకార్యక్రమాలకు నందమూరి కల్యాణ్ రామ్, పరుచూరి గోపాల కృష్ణ, దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ తదితరులు హాజరయ్యారు.

ఈ చిత్రం ప్రారంభోత్సవమ్ సందర్భంగా మొదటి సన్నివేశంపై కల్యాణ్ రామ్ క్లాప్ కొట్టగా, బివిఎస్ఎం

ప్రసాద్ మరియు వెంకి అట్లూరి కెమెరా ఆన్ చేశారు. దర్శకుడు హరీశ్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సంధర్భంగా చిత్ర యునిట్ మాట్లాడుతూ ఫ్రిబవరి నెల రెండవ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. హీరోయిన్ ఓరియెంటెడ్ గా వస్తున్నా ఈ చిత్రం, తప్పకుండా ప్రతి అమ్మాయికి నచ్చుతుందని తెలిపారు.