రికార్డ్ కలెక్షన్ ల వర్షం కురిపిస్తున్న ఎఫ్2 ..

0

సంక్రాంతి కి విడుదలై భారి విజయాన్ని అందుకొన్న చిత్రం ‘ఎఫ్2’. సీనియర్ హీరో వెంకటేష్‌.యంగ్ హీరో వరుణ్ తేజ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ‘ఎఫ్‌2’ సినిమా బాక్సీఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 25రోజులు పూర్తి చేసుకుని ఇంకా జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

రెండు వారాల థియేట్రికల్ రన్ గగనమైన ఈ రోజుల్లో నాలుగో వారంలో కూడా వసూళ్ళలో జోరు చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 12 న విడుదలైన ఈ సినిమా 25రోజుల్లో రూ. 77.87 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇది టాలీవుడ్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఎనిమిదవ చిత్రంగా కొనసాగుతోంది. మంచి కామెడీ టైమింగ్ ఉండడం వల్ల కుటుంబ సమేతంగా ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్యూ కట్టడంతో మంచి వసూళ్లు సాధించింది.

సంక్రాంతి కానుక గా వచ్చిన ఈ సినిమా ఈ సంవత్సరం మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని నమోదు చేసుకోవడమే కాకుండా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ ఫన్ ఇంకా కొనసాగుతుందని ‘ఎఫ్‌2’ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపిన విషయం తెలిసిందే. టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో ‘F2’ ఇప్పుడు 8వ స్థానంలో ఉండగా ‘శ్రీమంతుడు’ రూ. 84 కోట్ల షేర్ తో 7 వ స్థానంలో ఉంది. మరి ‘F2’ ఫుల్ రన్ లో ‘శ్రీమంతుడు’ ను దాటేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.