118 చిత్రం నుండి చందమామే సాంగ్ విడుదల

0

నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా , నివేతా థామస్ ,షాలిని పాండే హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం 118 . కె.వి గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాటను శుక్రవారం విడుదల చేశారు చిత్ర యూనిట్.ఈ పాటని కల్యాణ్‌ రామ్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.

చందమామే చేతికందే.. వెన్నెలేమో మబ్బులోనే అంటూ షాలిని పాండే ,కళ్యాణ్ రామ్ ల మీద సాగే ఈ రొమాంటిక్ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటుంది. ఈ సినిమా శేఖర్‌ చంద్ర సంగీతం అందించారు.పటాస్ తర్వాత ఒక విజయాన్ని కూడా అందుకొని కళ్యాణ్ రామ్ ఈ చిత్రం తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి మహేష్‌ కోనేరు నిర్మాత. మార్చి 1న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.