చ‌నిపోయిన హీరోతో సినిమా తీసిన కోడి రామ‌కృష్ణ

48
telugu movies director kodi ramakrishana.
telugu movies director kodi ramakrishana.

శ‌త చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ తనువు చాలించడం టాలీవుడ్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోట‌నే చెప్పుకోవాలి. కోడి రామకృష్ణ.. ఈ పేరు ప్రయోగాలకు మారు పేరు. కమర్షియల్ సినిమాలు చేసి ఈ డైరెక్టర్ ఎన్ని హిట్స్ ఇచ్చాడో, ఎక్స్ పెరిమెంటల్ పిక్చర్స్ కూడా తీసి అదే విధంగా సక్సెస్ అయ్యారు.

అరుంధతి, అమ్మోరు, అంజి వంటి సినిమాలు ప్రయోగాత్మక దర్శకుడిగా కోడి రామకృష్ణ కెరీర్ లో కీర్తి కిరీటాలు. 2016లో ఆయ‌న‌ చనిపోయిన హీరోతో ఓ సినిమా తీసి స‌రికొత్త ప్ర‌యోగానికి నాంది ప‌లికాడు.
2009లో చనిపోయిన కన్నడ హీరో విష్ణువర్థన్ తో 2016లో నాగరాహువు అనే టైటిల్ తో తెరకెక్కించాడు కోడి రామకృష్ణ. అదేంటీ చ‌నిపోయిన వ్య‌క్తిని హీరోగా పెట్టి ఎలా సినిమా తీస్తారు అనే డౌట్ మీకు రావ‌చ్చు. అయితే ఈ అద్భుతాన్ని, ఈ సాహసాన్ని కోడి రామకృష్ణ గ్రాఫిక్స్ సహాయంతో చేసాడు.

విష్ణువర్ధన్ రూపాన్ని మళ్లీ తెర మీద చూపించడానికి ఏడు దేశాలకు చెందిన 576 మంది గ్రాఫిక్స్ నిపుణులు 730 రోజుల పాటు కష్టపడ్డారట. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఏ చిత్రంలో చూడనటువంటి 120 అడుగుల శివనాగంని చూపించి అబ్బుర ప‌ర‌చారు. అయితే చనిపోయిన ఒక హీరోను తీసుకొని పూర్తి స్థాయిలో ఒక సినిమా చేయడం… మన దేశ మూవీ హిస్టరీలో అదే మొదటిసారి. ఈ ఘనత మన తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ సాధించడం మనందరికీ గర్వకారణం. అలాంటి గొప్ప ద‌ర్శ‌కుడు ఈ రోజు మ‌న‌మ‌ధ్య లేకపోవ‌డం బాధాక‌రం.