మజిలీ రెండవ పాట విడుదల

9
majili second song relise.
majili second song relise.

నాగచైతన్య-సమంతా హీరో హీరోయిన్లుగా శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మజిలీ’. ఏప్రిల్ 5 న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ‘మజిలీ’ నుండి ‘ప్రియతమా ప్రియతమా’ అంటూ సాగే రెండో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ సాహిత్యం చిన్మయి శ్రీపాద ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి.

ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి తరువాత సమంత – చైతూ కలిసి చేస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలనే పెట్టుకొన్నారు ప్రేక్షకులు. గోపీసుందర్ స్వరాలను సమకూర్చిన ఈ సాంగ్ యూట్యూబ్‌‌లో విడుదలైన కొన్ని నిమిషాలలోనే వైరల్ గా మారింది . సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటూ ప్రేమ మత్తులో తేలిపోయేలా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటికే ఈ సాంగ్‌ను ఏడున్నర లక్షల మంది యూట్యూబ్ ద్వారా వీక్షించారు.