కథానాయకుడు సినిమాపై బాలకృష్ణ, విద్యాబాలన్ మీడియాతో చిట్ చాట్..

0

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర నటుడు బాలకృష్ణ, నటీమణి విద్యాబాలన్ మీడియా చిట్ చాట్ లో పాల్గొన్నారు.. ఈ సందర్బంగా వారు సినిమాలోని కొన్ని సన్నివేశాలపై స్పందించారు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అన్ని విషయాలను ఈ బయోపిక్ లో కవర్ చేసినట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ బయోపిక్ తీస్తాను అని అసలు ఎప్పుడు అనుకోలేదని బాలకృష్ణ తెలిపారు. విద్యాబాలన్ మాట్లాడుతూ బాలకృష్ణ పక్కన నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. క్రిష్ మంచి డైరెక్టర్ అని పొగడ్తల వర్షం కురిపించారు.. ఎన్టీఆర్ గారిపై చాలామంది రాసిన పుస్తకాలను చదివి ఈ బయోపిక్ తెరకెక్కించడం జరిగిందని బాలకృష్ణ తెలిపారు. నేను ఎన్టీఆర్ సినిమాలు చూస్తూనే పెరిగానని బాలకృష్ణ వివరించారు. ఇటువంటి చిత్రం చేయడానికి శక్తిని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బాలకృష్ణ అన్నారు..