ఎన్టీఆర్ బయోపిక్ పై కృష్ణ గారుఏమన్నారో తెలుసా..?

0

స్వర్గీయ నందమూరి తారక రామా రావు గారు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం “ఎన్టీఆర్ కథానాయకడు” ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని నిర్మాతగా వ్యవహరిస్తూ నటించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించి చిత్రాలు, ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనలకు ఈ చిత్రంలో చక్కగా దర్శకుడు క్రిష్ రూపొందించారు. ఈ చిత్రం ఈ నెల 9వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఆయన సతీమని విజయ నిర్మల తనయుడు నరేష్ వీక్షించారు.

ఈ సందర్బంగా కృష్ణా మాట్లాడుతూ ఈ చిత్రం చూస్తు ఉంటే గడిచిపోయిన కాలం గుర్తుకు వచ్చిందని, బాలయ్య చాలా అద్బుతంగా నటించారని ప్రశంశించాారు . ఎన్టీఆర్ కథానాయకుడు తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు.

విజయ నిర్మల మాట్లాడుతూ .. తనకు 12ఏళ్ళు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారితో కలిసి పాండురంగ మహత్యం చిత్రం కృష్ణిడిగా నటించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. చాలా కాలం తరువాత మళ్లీ ఎన్టీఆర్ గారిని తెరపైన చేసునట్లు ఉందని, బాల కృష్ణ చాలా అద్బుతంగా నటించారని ఆమె తెలిపారు. నరేష్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ చిత్రంలో తను నటించినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బాలకృష్ణకు , క్రిష్ గారికి దన్యవాదాలు తెలియజేశారు.