వివాదాల మధ్య వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్

0

ఒక్క కన్ను గీటుతో ప్రపంచం మొత్తాన్ని తన వైపు కి తిప్పుకొన్న భామ ప్రియా ప్రకాష్. కన్ను కొట్టే వీడియో తో బాగా వైరల్ అయిన ప్రియా ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంది. వింక్ గర్ల్ లా కుర్రాళ్ళ మనసులను కొట్టేసిన ఈ హీరోయిన్ మూవీ తెలుగు లో లవర్స్ డే గా విడుదల అవుతుంది.

అయితే తాజాగా విడుదల అయిన ఈ టీజర్ లో హీరోగా నటించిన అబ్దుల్‌ రహూఫ్‌తో కలిసి చేసిన లిప్‌లాక్‌ సన్నివేశం ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రియా పై బాగా కోపం గా ఉన్నారు. ప్రమోషన్‌ కోసం చీప్‌ ట్రిక్స్‌ను ఆశ్రయిస్తున్నారంటూ మండిపడుతున్నారు. సినిమా మొత్తం లో ఏ సీన్స్ లేవనంటూ ముద్దు సీన్స్ మాత్రమే చూపిస్తున్నారు అంటూ ప్రియా ని ట్రోల్ చేస్తున్నారు. స్కూల్ పిల్లల్ని నాశనం చేసే పని ఇది అంటూ మరికొందరు నెగెటివ్ గా స్పందించారు. దీంతో కొందరు పెద్ద ఎత్తున వీడియోను డిస్‌లైక్‌ చేస్తున్నారు.