బోయపాటిని ఆకాశానికి ఎత్తేసిన రామ్ చరణ్..

0

వినయ విదేయ రామ చిత్రం విడుదల సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ చరణ్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. బోయపాటి డైరక్షన్ లో సినిమా చేయడానికి నాలుగు సంవత్సరాలు వేచిచూసానని రామ్ చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా బోయపాటి మంచి డైరెక్టర్ అని చరణ్ పొగడ్తలతో ముంచేశారు. రామ్ చరణ్ ని నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయించడానికి గల కారణాన్ని బోయపాటి వివరించారు. చిరంజీవి గారి అబ్బాయి అంటే అభిమానులలో ఒక ఇంప్రెషన్ ఉంటుంది, దానిని అందుకోవాలి అంటే మంచి కథ దొరకాలి. సినిమా తియ్యాలి అంటే ఎదో ఒక స్టోరీ పెట్టి తీసేయొచ్చు కానీ చిరంజీవి గారి అబ్బాయితో ఆలా చేయడం మంచిది కాదని నాకు అనిపించింది. అందుకే రామ్ చరణ్ ను వెయిట్ చేయించాయనని బోయపాటి తెలిపారు. కథలో ఎటువంటి చేంజెస్ లేకుండా, ఎక్కడ రాజి పడకుండా షూటింగ్ చేశామని రామ్ చరణ్ తెలిపారు. బోయపాటి దగ్గర ఎమోషన్, ఫ్యామిలి, ఫ్యాక్షన్ వంటి అన్ని యాంగిల్స్ ఉన్నాయని బోయపాటిని ఆకాశానికి ఎత్తాడు రాంచరణ్. ఈ సినిమాలో ఫ్యామిలి గురించి ఉన్న సీన్స్ రాంచరణ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రేమ అభిమానాలను చూసే సినిమా తీశానని బోయపాటి తెలిపారు.