“పడి పడి లేచే మనసు “ఒక మంచి చిత్రం అవుతుంది .. హీరో శర్వానంద్.

0

గమ్యం , మహానుభావుడు జర్నీ వంటిసూపర్ హిట్ ప్రేమకథ చిత్రాలలో నటించిన హీరో శర్వానంద్, ‘ఫిదా” సినిమా తో తెలుగు కుర్రకారు ను ‘ఫిదా” చేసిన సాయి పల్లవి వీరిద్దరి కాంబినేషన్ లో దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పడి పడి లేచే మనసు”. ఈ నెల 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ..

హీరో శర్వానంద్ తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ సినిమా విశేషాలను ప్రెక్షకులతో పంచుకున్నారు .. ఆయన మాట్లాడుతూ మంచి కుటుంబ కథ చిత్రం అవుతుందని అన్నారు. కొన్ని ప్రేమకథా చిత్రాలు ఆడియన్స్ తోపాటు వాళ్ల ఇళ్లకి వెళ్లిపోతాయి. నాగార్జున ‘గీతాంజలి’ .. ‘సఖి’.. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి సినిమాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఆ సినిమాల సరసన ‘పడి పడి లేచె మనసు’ కూడా నిలిచిపోతుంది” అని చెప్పుకొచ్చాడు.
.
“చాలామంది కాంబినేషన్ ను బట్టి సినిమాలు చేస్తుంటారు .. కథను నమ్మి సినిమాలు చేసే వాళ్లు చాలా తక్కువ. అలాంటివారిలో ఈ సినిమా నిర్మాత ఒకరు .. ఆయనకి నేను హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ఇండస్ట్రీకి ఇలాంటి నిర్మాతలు చాలా అవసరం. ఇక దర్శకుడు హను రాఘవపూడి కథ చెప్పగానే ‘ఈ సినిమా బ్లాక్ బస్టర్ ..రాసి పెట్టుకో’ అని చెప్పాను,అని హీరో శర్వానంద్ ఇంటర్వ్యూ లో సినీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు .