సప్తగిరి వజ్ర కవచధర గోవింద టీజర్ :

0

ప్రముఖ కమెడియన్ సప్తగిరి కథానాయకుడుగా వైభవీ జోషీ కథానాయికగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. ఈ చిత్రంలో గోవిందు అనే ఫన్నీ దొంగ పాత్రలో సప్తగిరి కనిపించనున్నారు. ఈ చిత్రానికి అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తుండగా… శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. టీజర్ లో వచ్ఛే ఓ సీన్లో… సప్తగిరి కత్తి పదును పెడుతుండగా వస్తున్న నిప్పు రవ్వలను త్రాగుతూ కనిపించడం టీజర్లో హైలెట్ అయంది. ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .