లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నుండి మరో పాట విడుదల చేయనున్నట్లు వెల్లడించిన వర్మ

0

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్”. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా వచ్చారన్న అంశాన్ని కథగా తీసుకోని ఈ సినిమా తీశారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల “నమ్మక ద్రోహం ” అనే పాటను విడుదల చేసి, టీడీపీ నాయకుల ఆగ్రహానికి గురైన ఆయన, ఈ చిత్రం నుండి రెండవ పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. “జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి వారిని కాదని లక్ష్మీపార్వతిని ఎందుకు?.. ఎందుకు?” అంటూ సాగే పాటకు సంబంధించిన ఓ వీడియోని తన ట్విట్టర్ లో పోస్టు చేశారు ఆర్జీవీ. ఈ పాటలోని ప్రశ్నల వెనుక అబద్దాలుగా చెలామని అవుతున్న నిజాలను, నిజాలుగా చెలామని అవుతున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ధ్యేయమని ఆయన అందులో వివరించారు.