2019 లో సందడి చేయనున్నబయోపిక్ చిత్రాలు …

0

తెలుగు చలన చిత్ర రంగంలో ప్రస్తుతం బయోపిక్ చిత్రాల హావా నడుస్తున్నదని చెప్పవచ్చు .. రానున్న సంక్రాంతి పండుగ కు బయోపిక్ చిత్రాలు బాక్సఫిస్ దగ్గర సందడి చేయనున్నాయి .. తాజగా నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రం “ఎన్టీఆర్ బయోపిక్|” దర్శకత్వము వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా కథానాయకుడు , మహానాయకుడు గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . సంక్రాంతి పండుగ సందర్బంగా మొదటి భాగం “కథానాయకుడు ”
గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .

.తాజా గా దిగవంత నేత వైస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్నచిత్రం “యాత్ర ” ఈ దర్శకుడు మహి . వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో వైస్ పాత్ర లో హీరో మమ్ముట్టి నటించారు .. “యాత్ర ” రాజశేఖర రెడ్డి పాత్ర లో మమ్ముట్టి లుక్ అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది .. ఈ చిత్రం లో దర్శకుడు రాఘవ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర , రాజకీయ ప్రస్థానం , రాజకీయ ఆరంగ్రేటం మొదలగు విషయాలను ఇందులో చూపించబోతున్నారు అలాగే ఈ చిత్రం లో వైస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ పాత్ర చాల ప్రాధాన్యత సంతరించుకుంది “యాత్ర” సినిమా లో వైస్ విజయమ్మ పాత్ర లో “ఆశ్రీతవేముగంటి” నటించింది … ఆమె కు సంబందించిన ఫస్ట్ లుక్ కొద్దీ సేపటి క్రితం విడుదల చేశారు .. సినిమా లుక్ ను చుస్తే వైస్ విజయమ్మకు చాల దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది .. ఈ పాత్ర విషయం లో దర్శకులు ఎంత శ్రద్ద తీసుకున్నారు అనే విషయం ఫస్ట్ లుక్ ను చుస్తే అర్థం అవుతుంది .. ఫిబ్రవరి 8 వ తేదీన విడుదల చెయ్యనున్నారు .. ఈ సినిమా రిలీజ్ కోసం రాజశేఖర్ రెడ్డి అభిమానులు , ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు .

రాంగోపాల్ వర్మ దర్శకుడి గా “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు .. ఈ చిత్రంలో ఒక పాటను విడుదల చేశారు .. ఈ పాటకు అభిమానులనుండి మంచి స్పందన లభించింది .. ఈ సినిమా లో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం , రాజకీయ అరంగ్రేటం ,లక్ష్మి పార్వతి కి ఉన్న ప్రాధన్యత వంటి అంశాలపై దర్శకుడు ఈ చిత్రంను నిర్మిస్తున్నారు .. ఈ చిత్రం ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది .. బయోపిక్ ల హావా నడుస్తున్న తరుణం లో బాక్సాఫీస్ దగ్గర ఏ చిత్రం మంచి విజయం సాధిస్తుందో వేచి చూడాలి …