4 లెటర్స్’ మూవీ రివ్యూ ….

88
4 letters, movie preview.
4 letters, movie preview.

ఈశ్వర్ అనే కొత్త హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ… టుయా చక్రవర్తి, అంకిత మహారాణలు కథానాయికలుగా నటించిన చిత్రం ‘4 లెటర్స్’. ‘కుర్రాళ్లకు అర్ధమౌతుందిలే’ అనేది ఉపశీర్షిక. ఇటీవలి ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే… అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్‌తో ‘కలుసుకోవాల‌ని’ లాంటి ల‌వ్ స్టోరీని తెరకెక్కించిన ఆర్. ర‌ఘురాజ్‌ ఈ చిత్రంతో మళ్లీ మెగాఫోన్ పట్టుకున్నారు. కథలోకి వెళ్తే.. విజ్జు (ఈశ్వర్) టాప్ బిజినెస్ మెన్ కొడుకు. కొన్ని వందల కోట్లకు ఒక్కడే వారసుడు, అతను బి.టెక్ చదువుతుంటాడు. మోస్ట్ ఇంటిలిజెంట్‌ ఫెలో. అతను అడిగే ప్రశ్నలకు కాలేజీ లెక్చరర్స్ కూడా భయపడుతుంటారు.

పైగా విజ్జు తండ్రి కూడా ఎన్ని కోట్లు అయిన ఖర్చు పెట్టి, లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చెయ్యమని కొడుకుని ఎంకరేజ్ చేస్తుంటాడు. కాగా ఈ క్రమంలో అనుకోకుండా పొరపాటున జరిగిన ఓ సంఘటన కారణంగా అంజలి (టుయా చ‌క్ర‌వ‌ర్తి) అతను చెప్పినట్లు వినాల్సి వస్తోంది. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం విజ్జుకి ఇంప్రెస్ అయిన అంజిలి అతన్ని ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాల చేత అంజలి అతనికి బ్రేక్ అప్ చెప్పి విడిపోతుంది. ఆ తరువాత విజ్జు లైఫ్ లోకి మరో అమ్మాయి (అంకిత మ‌హారాణా) వస్తోంది. వీరిద్దరూ ప్రేమిచుకుంటారు. కానీ అంతలో అంజిలి మళ్ళీ విజ్జు లైఫ్ లోకి రావటానికి ప్రయత్నిస్తోంది. చివరకి అతను ఏ అమ్మాయిని ప్రేమించాడు? ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు అనేదే ఈ సినిమా.