తిరుమల శ్రీవారి ఆర్జిత టిక్కెట్లను విడుదల చేసిన టీటీడీ….!

32
ttd
ttd

  తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. నవంబరు నెలకు సంబంధించిన 67,567టిక్కట్లను అధికారిక వెబ్ సైట్లో ఉంచారు. సుప్రభాత సేవకు 7,512, తోమాల సేవ 100, అర్చన 100, అష్టాదళ పాదపద్మారాధన సేవకు 180, నిజపాద దర్శనం 2,875 టిక్కెట్లను కేటాయించారు. సాధారణ పద్ధతిలో కల్యాణోత్సవానికి 12,825, ఊంజల్‌ సేవకు 4,050, వసంతోత్సవానికి 14,300, సహస్త్రదీపాలంకరణ సేవ 16,200, విశేష పూజకు 2 వేల టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఇందులో 10,767 సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో కేటాయించారు.  అనంతరం లాటరీ పద్ధతిలో సేవా టిక్కెట్లను కేటాయిస్తారు. అద్దె గదులు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేసింది.