మొన్న మోజో.. ఇవాళ టీవీ 1.. రేపు ఏ సంఖ్యా నెంబర్ ఛానల్ కు మూడిందో.. ఆల్ ద బెస్ట్ జర్నలిస్టులు

76

తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు చెడు రోజులు నడుస్తున్నాయి. ఏ సంస్థకు వెళ్దాం అన్నా నో వేకెన్సీతోపాటు ఉన్న ఎంప్లాయిస్ ను రోడ్డున పడేస్తున్నాయి సంస్థలు. దీనికితోడు మీడియాలో కార్పొరేట్ సంస్థల ఎంట్రీ మరింత ఇబ్బందిగా మారింది మీడియా సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు. మొన్నటికిమొన్న టీవీ9 టేకోవర్ తర్వాత.. మోజో టీవీని నిర్ధాక్షణ్యంగా మూసివేశారు. 200 మంది ఉద్యోగులను నడిరోడ్డున పెట్టారు. ఇప్పుడు టీవీ9 వంతు వచ్చింది. 160 మంది ఉద్యోగులకు మూడింది. ఎక్కడైనా చూసుకుని వెళ్లండి అని చెప్పేసింది టీవీ9 యాజమాన్యం. మూడు నెలల జీతాలు ఇస్తాం అని సగర్వంగా ప్రకటించటం విశేషం. 3 నెలల జీతం కాదు.. మూడు కాలాల పాటు సంస్థలో పని చేయాలని కోరుకుంటున్నాం అని ఎంప్లాయిస్ చెప్పినా నో చెప్పింది యాజమాన్యం. డిసెంబర్ 1వ తేదీ వేసే జీతాలతో టీవీ వన్ లో 160 మంది ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. మరో మీడియాకు వెళ్దాం అంటే అన్ని ఛానల్స్ వాళ్లవే అయిపోయాయి. ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి జర్నలిస్టులది.

ఒక్క టీవీ-1లోనే కాదు.. టీవీ9 నుంచి కూడా 40 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంత నిజమో ఏమోగానీ.. మొత్తానికి టీవీ9 టేకోవర్ చేసిన కొత్త యాజమాన్యం మాత్రం తీసివేతలతో దడ పుట్టిస్తుంది. సంప్రదాయం తొక్క తోలా అంటూ జర్నలిస్టులను పీకిపారేస్తోంది. బ్రాండ్ ఛానల్ టీవీ9 ఉండగా.. మిగతావన్నీ ఎందుకు దండగ అంటోంది యాజమాన్యం.

నిజమే సారూ.. ఇప్పటికే కుప్పలు-తెప్పలుగా పట్టుకొస్తున్న జర్నలిస్టులతోపాటు ఛానల్స్ ను చంపేయాలంటే ఈ ఫార్ములానే బెటర్. ఇప్పటికే జర్నలిస్టులు అంటే ఛీ కొడుతున్నారు.. కుక్క కంటే హీనంగా చూస్తున్నారు. మీలాంటి మహానుభావులు అయినా తెలుగు జర్నలిస్టులను మ్యాగ్జిమమ్ చంపేసి.. ప్రక్షాళన చేసి.. తిరిగి గౌరవం తీసుకురాగలరని నిజమైన జర్నలిస్టుల విన్నపం

మొన్న మోజో.. ఇవాళ టీవీ 1.. రేపు సంఖ్యా నెంబర్ ఛానల్ కు మూడిందో.. ఆల్ ద బెస్ట్ జర్నలిస్టులు