విశాఖలో సందడిగా సంక్రాంతి సంబరాలు

0

విశాఖ నగరంలో బడి పిల్లల సంక్రాంతి సంబరాలు అబురపరుస్తున్నాయి. నగరంలోని ఆశీలుమెట్ట ప్రాంతంలో ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరం విద్యార్ధులకు తెలిసేలా చేసిన పలు ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి.ఈ సందర్బంగా విద్యార్ధుల సాంప్రదాయ వస్త్రధారణ చూడముచ్చట గొలిపింది. బోగిమంట వేసి చుట్టూ విద్యార్ధులతో పాటు టీచర్స్ కూడా సందడి చేశారు. తెలుగుదనం ప్రతిబించే రీతిలో జరిగిన వేడుకల్లో విద్యార్ధులు అనదోత్సాహాలలో మునిగితేలారు. చిన్నారుల నృత్యాలను చూస్తూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మురిసిపోయారు