“ఎన్టీఆర్” లో దాసరి నారాయణ రావు పాత్రలో వీవీ వినాయక్…!

0

ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఈ విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడి గురించి అలనాటి నుండి నేటి వరకు తెలియని వారు వుండరంటే అతిశవోక్తి కాదు.. అంతటి నటుడు తన ప్రంతం పట్ట మక్కువతో రాజకీయాల్లోకి వచ్చిన నేత మనకు కనిపించడు.. ఆ మహా నాయకుడి జీవిత చరిత్ర అంటే నేటి తరానికి తెలుసు కోవలసిన సంఘటనలు ఎన్నో మరెన్నో ఉంటాయి.. కాగా ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “ఎన్టీఆర్” కథానాయకుడిలో దర్శక దీరుడిగా పేరు సంపాదించుకున్న దాసరి నారాయణరావు గారి పాత్ర ఎంతైనా ఉంది.. కాగా ఈ చిత్రంలో ఆయన పాత్రను వీవీ వినాయక్ పోషిస్తున్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది..

దాసరి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దాసరి దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా 1980లో వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’, 1982లో వచ్చిన ‘బొబ్బిలిపులి’, ఆయన రాజకీయ జీవితానికి బాటలు వేసిన చిత్రాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. దీంతో బయోపిక్ లో దాసరి పాత్ర కీలకంగా నిలువనుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇప్పటి దాక చిత్ర యునిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలుపడలేదు.. ఈ వార్త లపై ఎంత నిజముందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.. కాగా వచ్చే సంవత్సరం జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నపట్లు ఇప్పటికే చిత్ర యునిట్ ప్రకటించిది..