మండోద‌రి అమ్మ‌వారి విగ్రహ ప్రతిష్ట

1

పశ్చిమ గోదావరి జిల్లా ..ఉండి మండలంలోని కోలమురు గ్రామంలో అమ్మవారి ఆల‌య పునఃనిర్మాణ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. గ్రామ దేవ‌త అయిన మండోదరి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్య‌క్ర‌మాల‌ను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు.

వేడుక‌ల్లో భాగంగా అమ్మవారికి అగ్ని ప్రతిష్ట హోమం, కుంభ పూజ ,పుణ్య హవాచనం,గో దర్శనం చేశారు. అనంత‌రం వేద పండితులు ప్రత్యేక యాగాలు నిర్వహించారు. దంప‌తుల చేత ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. క‌ల‌శ పూజ‌లు నిర్వ‌హించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గోన్న భ‌క్తుల‌కు ఆల‌య క‌మిటీ వారు అన్న‌దానం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలోపెద్ద సంఖ్యలో గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.