కుర్ర ఎమ్మెల్యేలు.. బాబును కుమ్మేస్తున్నారు : ఫస్ట్ టైం వచ్చినోళ్లు కూడా

440
chandrababu naidu and mls ysrcp

కుర్రోళ్లు ఓయ్.. కుర్రోళ్లు.. సభలోనే చంద్రబాబును ఆడేసుకుంటున్నారు అనుభవం.. అనుభవం.. ఇదీ నిన్నటి వరకు రాజకీయాల్లో ఉన్న మాట. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ చూస్తే మాత్రం కొత్త అర్థం వచ్చేసింది. కంటెంట్ ఉంటే చాలమ్మా.. ఎవడైతే ఏంటీ అంటూ బాబును నేరుగా కుమ్మేస్తున్నారు.. ఆడుకుంటున్నారు. సీనియరా తొక్కా అంటూ తొక్కిపడేస్తున్నారు. మైక్ వస్తే చాలు వాయిస్ రైజ్ చేసేస్తున్నారు. సుత్తిలేకుండా సూటిపోటి మాటలతో నేరుగానే తిట్టిపోస్తున్నారు. ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే కూడా వెటకారంతో బాబును ఏకిపారేస్తున్నారు.

ఇష్యూ ఏదైనా టార్గెట్ చంద్రబాబు. టాపిక్ ఏదైనా బాబు వైపు డైవర్ట్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ స్టార్ట్ చేస్తున్నారు.. ఒకరు సన్నాసి అంటే.. మరొకరు దగుల్భాజీ అంటున్నారు. మరొకరు బుద్ధిలేదా అంటున్నారు. ఇంకొకరు సిగ్గు లేదా అంటున్నారు. ఒకరు మెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలి అంటారు.. మరొకరు మెంటల్ హాస్పటల్ కు బాబు పేరు పెట్టాలి అంటారు.. ఒక ఆయన అంటారు నీ బుద్ధి కుక్కతోక వంకర అంటారు.. మరొక ఆయన అయితే నువ్వు అసలే మనిషివేనా అంటారు.. ఇవన్నీ కూడా సభలో ఎదురుగా ఉన్న చంద్రబాబుకు వేలు చూపిస్తూ.. ఆయన పేరు ప్రస్తావిస్తూ తిట్టిపోస్తున్నవి.

ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్ అంటున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను కూడా దుమ్ముదులుపుతున్నారు. దమ్మంటే ఏంటో వాళ్లకు కూడా చూపిస్తున్నారు. ఇన్నాళ్లు పేపర్లలో రాసుకున్న దమ్మును.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా దులుపుతున్నారు. రామోజీరావు ఎప్పుడూ వినని.. వింటాను అని కూడా అనుకోని విధంగా అన్నేసి మాటలు అంటున్నారు. ఈనాడును టచ్ చేస్తే వాడి రాజకీయ జీవితం మటాష్ అన్నంత భయం నుంచి.. సన్నాసి పేపరు.. ఎన్టీఆర్ ను చంపాను.. కుట్రలు రాస్తాడు.. కుతంత్రాలు చేస్తాడు అని సభలోనే ఏకిపారేస్తున్నారు.

నీయమ్మ మొగుడికి చెప్పాను.. నీయమ్మ సొత్తా.. దద్దమ్మ, సన్నాసి, వెధవ, వెధవన్నార వెధవ, తొలు తీస్తా.. తాట తీస్తాం.. నీ జాగీరు కాదు.. నీ హయాం కాదు అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా.. దెప్పిన మాట మళ్లీ దెప్పకుండా కుమ్ముడే కుమ్ముడు..

ఇదంతా అధికారంతో వచ్చిన అహంకారం అనుకుంటే పొరపాటే.. పదేళ్లపాటు గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతం. 70 ఏళ్ల వయస్సు చంద్రబాబును అనుభవించాల్సిందే అన్నట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియా పుణ్యమో ఏమో.. పేపర్లు, టీవీలను కూడా వదలట్లేదు..