సంచలన నిర్ణయం..! కాంగ్రెస్ పార్టీ మూకుమ్మడి రాజీనామాలు..!

83
All Telangana congress MLAs decide to resign
All Telangana congress MLAs decide to resign

కాంగ్రెస్ పార్టీ మూకుమ్మడి రాజీనామాలు..!

కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను రద్దు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. దీంతో పార్టీ తమ భవిష్యత్ ప్రణాళికను రూపొందించే పనిలో నిమగ్నమైంది. కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసి, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు, జానారెడ్డి అధ్యక్షతన సమావేశమై సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యందరూ ఒకేసారి మూకుమ్మడిగా రాజీనామాలు చేసేసి, మళ్లీ ఉపఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం తెలుగురాష్ట్రాల చరిత్రలోనే ఒక విపక్ష నేతను ఈ తరహాలో సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి. టీఆర్ఎస్ చేసిన ఈ పనినే ఒక అస్త్రంగా వాడుకుని, ప్రజల్లోకి వెళ్లి సింపతీతో కొట్టాలనేది కాంగ్రెస్ ప్లాన్. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేస్తే, స్పీకర్ వాటిని ఆమోదిస్తారా..? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ఆమోదించకపోతే క్లియర్ గా కాంగ్రెస్ కే లాభం. ఒకవేళ ఆమోదిస్తే, పార్టీ ఫిరాయించి తెరాసలోకి జంప్ అయిన వారి రాజీనామాలు మీవద్ద పెండింగ్ లో ఉన్నాయి..వాటి మాటేంటి అని స్పీకర్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్ చేసేయచ్చు. ఈ విధంగా ఇప్పుడు తెరాసకు, కేసీఆర్ కు చెక్ మేట్ చెప్పి ఎటూ వెళ్లలేని స్థితిలోకి తీసుకురావచ్చని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్.

See Also: కేసీఆర్ చెబితేనే.. స్వామిగౌడ్ హాస్పిటల్లో చేరారు