చంద్రబాబు పర్యటనలో చెప్పుకోలేని చెప్పు కథ ఏంటీ.. ఆ చెప్పు విసిరింది ఎవరు?

144
attack on chandrababu naidu with chappal

అమరావతిలో చంద్రబాబు టూర్ ఉద్రిక్తంగా జరిగిందన్నా సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్. ఒకే ఒక్క చెప్పు చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై పడింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. వంద మంది ఉన్న గుంపు నుంచి ఒకే ఒక్క చెప్పు విసరటం ఏంటీ.. ప్లానింగ్ అయితే 40, 50 చెప్పులు పడాలి కదా.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం చెప్పుతో తన ప్రతాపం చూపటం వెనక ఇంట్రస్టింగ్ స్టోరీ నడుస్తోంది ఏపీ పాలిటిక్స్ లో.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన రైతులు చెప్పులతో దాడి చేయాలి అని ప్లాన్ చేస్తే భారీ సంఖ్యలో పడేవి. కేవలం నిరసన మాత్రమే అనుకుంటే అసలు చెప్పు విసిరేవారు కాదు. ఈ రెండు అంశాలకు భిన్నంగా ఒకే ఒక్క చెప్పు పడటంపై వైసీపీ నేతలు.. టీడీపీ వైపు అనుమానపు చూపులు చూస్తున్నారు. బాధిత రైతులకు కేవలం మద్దతు మాత్రమే ఇస్తామని చెప్పుకుంటూనే ఈ చెప్పు కథ ఏంటీ అని నర్మగర్భంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక టీడీపీ కూడా ఈ చెప్పు వెనక చెప్పుకోలేని బాధతో ఉందని వార్తలు వస్తున్నాయి. వేయించుకోవాలంటే ఒకటీ, రెండు ఎందుకు.. ఏకంగా ఓ వంద చెప్పులు వేయించుకునేవాళ్లం కదా అంటూ సెటైర్లు వేస్తున్నారు నేతలు. ఈ చెప్పులు, రాళ్లు, కర్రలు మాకు కొత్త కాకపోయినా.. మరీ ఒక్క చెప్పు మాత్రమే పడటం వెనక కూడా కొంచెం అసహనం, అసంతృప్తిగా ఉన్నారంట.

అసలు ఆ చెప్పు విసిరింది ఎవరు.. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి.. నిజంగా రైతేనా.. అన్న కోణంలో ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ కూడా విచారణలోకి దిగింది. అన్ని ఛానల్స్ ఫుటేజ్ పరిశీలిస్తోంది. ఎవరైనా సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా అని కూడా పరిశీలించి చెప్పు కథ నిగ్గు తేల్చాలని గట్టిగా నిర్ణయించుకుంది అంట జగన్ సర్కార్..