పగిలిన కాళ్లు..తెగిన చెప్పులు..రక్తపు అడుగులు: ముంబై చేరిన రైతుల పాదయాత్ర

99

ముంబై చేరిన రైతుల పాదయాత్ర

రైతుల పాదయాత్రతో ముంబై తీరం ఎరుపెక్కింది. ఎక్కడ చూసినా రైతులు, మద్దతుదారులతో హడావిడి నెలకొంది. పగిలిన కాళ్లు, తెగిన చెప్పులు, రక్తపు అడుగులు మహారాష్ట్రలో రైతులు చేపట్టిన పాదయాత్ర ముంబై చేరింది. 50వేల మందితో భారీ బహిరంగ సభ కూడా జరగనుంది.

Image result for mumbai farmers rally photos

నాసిక్ నుంచి ముంబై వరకు 180 కిలోమీటర్లు రోజుకి 30 కిలోమీటర్లు నడిచిన రైతుల పరిస్థితి ఎలా ఉంది.  మండే ఎండను లెక్కచేయకుండా సాగిన మహా యాత్రలో అలిసిన రైతు ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తున్నారు.  ఎప్పుడూ పొలాల్లో తిరిగే కాళ్లు.. కాంక్రీట్ రోడ్లపై నడవటంతో బొబ్బలెత్తాయి. చాలా మందికి మడెం దగ్గర బాగా పగుళ్లు వచ్చాయి. మరికొందరికి పుండ్లు పడ్డాయి. ఆ రక్తంతోనే అడుగులు వేశారు రైతులు.

ప్రస్తుతం ఆజాద్ మైదాన్ లో ఉన్న రైతులను పరామర్శిస్తే ఇలాంటి కన్నీటి గాథలు ఎన్నో… అసలే మండుతున్న ఎండలు.. తారు రోడ్డుపై నడుస్తుండటంతో చాలా ఇబ్బంది పడ్డామని చెప్పుకొచ్చారు వారు.. నిత్యం నడక అలవాటే అయినా.. ఇలాంటి రోడ్డుపై మొదటి రోజు చాలా కష్టపడ్డాం అని.. రెండో రోజు నుంచి అలవాటు అయ్యిందన్నారు.

ఈ ర్యాలీలో ఒక్క రైతులే కాకుండా 5వేల మంది వరకు ఆదివాసీలు కూడా ఉన్నారు.  తరాలుగా అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని.. కొండలను పిండి చేసి వ్యవసాయంతో జీవనాధారం పొందుతున్నామని ఆదివాసీలు అంటున్నారు. ఇప్పటికిప్పుడు వాటిని వదిలేసి వెళ్లమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Image result for mumbai farmers rally photos

See Also: 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్..