నారా లోకేష్ ఇక పోటీ చేయరా..? మళ్లీ షార్ట్ కట్టేనా..?

0

గత కొద్దిరోజులుగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ విషయంలో చాలా తీవ్ర కసరత్తులు చేస్తున్నారంటూ వార్తలు వినవస్తన్న సంగతి తెలిసిందే. అనేక చోట్ల అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ.. బాబు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలనేది ఆయన ఆలోచన. అంతా బాగానే ఉంది కానీ.. ఆయన తనయుడు లోకేష్ ను ఎక్కడి నుంచి పోటీ చేయించాలనుకునే దానిపై మాత్రం చంద్రబాబు సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. దీనిపై పార్టీ వర్గాలు కూడా చాలా టెన్షన్ పడుతున్నాయి. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఆ విషయాన్ని చెప్పట్లేదా.. లేక నిజంగానే లోకేష్ గెలుపుపై సందేహంతో సైలెంట్ గా ఉన్నారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

లోకేష్ ను గత ఎన్నికల్లో సైతం, డైరెక్ట్ గా ఎమ్మెల్సీగా ఎంపిక చేయించి.. అనంతరం మంత్రిస్థానంలో కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అనేక విమర్శలు వచ్చినా.. బాబు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా లోకేష్ కు ఎమ్మెల్సీ ఇచ్చేద్దామనే బాబు భావిస్తున్నారా..? ఒకవేళ లోకేష్ ఓటమిపాలైతే.. ఇక తలెత్తుకోలేమని భావిస్తున్నారా.. తెదేపా కార్యకర్తల మధ్య ఇప్పుడివే చర్చలు నడుస్తున్నాయి. కనీసం టీడీపీ కంచుకోటగా నిలబడే స్థానాల్లోనైనా లోకేష్ ను నిలబెట్టి.. ఏదో రకంగా గెలిపించుకోవడం గౌరవంగా ఉంటుందని నాయకులు సూచిస్తున్నారు. మరి లోకేష్ పోటీ చేస్తారా..? లేదా అన్నది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.