రిచ్ పొలిటీషియన్..రూ. 1000 కోట్ల ఆస్తులతో జయాబచ్చన్ రికార్డ్..!

81
Jaya bachchan record for richest parliamentarian with Rs 1000 crores
Jaya bachchan record for richest parliamentarian with Rs 1000 crores

1000 కోట్ల ఆస్తులతో జయాబచ్చన్ రికార్డ్..!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్, అత్యంత ధనవంతురాలైన పార్లమెంటేరియన్ గా చరిత్ర సృష్టించబోతున్నారు. సమాజ్ వాదీ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఈ సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్ లో, తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన మొత్తం ఆస్తులు రూ. 1000 కోట్లు అని ఆమె అఫిడవిట్ లో స్పష్టం చేశారు. దీంతో 2014లో రూ.800 కోట్లు ఆస్తుల్ని ప్రకటించిన బీజేపీ ఎంపీ రవీంద్ర కిషోర్ సిన్హా రికార్డును జయాబచ్చన్ దాటేశారు.

Image result for jayabachan photos

2012లో కూడా ఎస్పీ అభ్యర్ధిగా రాజ్యసభకు నామినేషన్ వేసిన జయ, అప్పుడు సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తులు రూ. 493 కోట్లుగా ప్రకటించగా, ఈ ఎన్నికలు వచ్చేసరికి ఆ మొత్తం డబుల్ అయింది. ఇక ఈ ఆస్తిలో రూ. 62 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన 12 వాహనాలు ఉన్నాయి. కార్లలో దాదాపు అన్ని లగ్జరీ బ్రాండ్లనూ బచ్చన్ ఫ్యామిలీ కొనేయడం గమనార్హం. రోల్స్ రాయిస్, మూడు మెర్సిడెస్ బెంజజ్, పోర్షే, రేంజ్ రోవర్..ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల టాప్ మోడల్ కార్లను బచ్చన్ల సెల్లార్ లో నింపేశారు. అన్నట్టు అమితాబ్ బచ్చన్ కు ఒక టాటా నానో, ట్రాక్టరు కూడా ఉన్నాయట.

ఇక వీరి ఆస్తిలో రూ. 3.4 కోట్ల విలువైన వాచీలు అమితాబ్ వద్ద ఉంటే, రూ.51 లక్షల విలువైన వాచీలు జయాబచ్చన్ వద్ద ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ వాడే ఒక పెన్ను విలువే రూ.9 లక్షలు! ఇక దేశవిదేశాల్లో బచ్చన్ల కుటుంబానికి స్థిరాస్తులు, చరాస్తులు ఉన్నట్టుగా తన అఫిడవిట్ లో స్పష్టం చేశారు జయాబచ్చన్.