కాపు రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు..ఇప్పట్లో అయ్యే పని కాదు..!

69
Kapu and muslim reservations may not be easy to implement
Kapu and muslim reservations may not be easy to implement

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కాపు రిజర్వేషన్ల బిల్లును నిర్ద్వదంగా తోసిపుచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నిర్ణయాన్ని ఈ బిల్లు తుంగలో తుక్కుతోందని హోంశాఖ అభిప్రాయపడింది.

ఇక తెలంగాణలో బీజేపీ ముస్లిం బిల్లును వ్యతిరేకిస్తోంది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ సమ్మతం కాదనేది బీజేపీ వాదన. తెలంగాణ సర్కారు కావాలనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో సమానంగా ముస్లిం రిజర్వేషన్ల బిల్లును తెరపైకి తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు. తెరాస ప్రభుత్వం అత్యంత అశాస్త్రీయమైన పద్ధతిలో కలెక్ట్ చేసిన డేటా ద్వారా ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయత్నిస్తోందని, చట్టప్రకారం ఇది సరైన పని కాదని లక్ష్మణ్ వాదిస్తున్నారు.

అయితే ముస్లిం రిజర్వేషన్లు సాధ్యమేనని అంటున్నారు హైకోర్టు లాయర్ దామోదర్ రెడ్డి. రాజ్యాంగంలో మార్పులు చేసి ముస్లిం రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయడానికి పార్లమెంటుకు అధికారం ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 15(4) ఆర్టికల్ ప్రకారం, వెనుకబడిన తరగతులకు సహాయం చేసేందుకు, రాజ్యాంగంలో ప్రత్యేకమైన మార్పులు చేసే అధికారాలు కేంద్రప్రభుత్వానికి ఉన్నాయి. అయితే, ఆర్టికల్ 16లోని క్లాజ్ 2 ప్రకారం భారతదేశ పౌరుడిని మత, కుల, ప్రాంత, లింగ, నివాస ప్రాంత లేదా ఇంకేదైనా భేదాల బట్టి అసమానంగా చూడటం నేరం అని కూడా రాజ్యాంగంలో ఉంది. పైగా ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్ల బిల్లు, తమిళనాడులో ఉన్న 69 శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నాయి. వాటిపై తీర్పు వస్తే కానీ, బాబు ప్రతిపాదించిన కాపు రిజర్వేషన్లు, కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ముస్లిం రిజర్వేషన్లు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు.