ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్

249

బీజేపీకి ఔట్ అండ్ ఔట్ సపోర్ట్ చేస్తున్న పవన్ కల్యాణ్.. ఇక నుంచి ఆ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారనున్నారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఏపీ బీజేపీ నేతలకు సమాచారం వచ్చిందంట. ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో ఢిల్లీలోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పవన్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది బీజేపీ అధిష్టానం. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు సమాచారం కూడా ఇచ్చారంట.

ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. రెండు రోజులు ఢిల్లీలోనే ఉండి బీజేపీ తరపున ప్రచారం చేయటానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారంట. ఏపీ భవన్ వేదికగా ఓ చిన్న సభ కూడా నిర్వహించాలని డిసైడ్ అయ్యింది బీజేపీ. కేజ్రీవాల్ ను ఎదుర్కోవాలి అంటే.. అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్లకు వల వేయాల్సిందే. అందులో భాగంగానే ఏపీ నుంచి పవన్ కల్యాణ్ ను ఎంచుకున్నారు. దీనిపై జనసేన పార్టీ అధికారికంగా నోట్ రిలీజ్ చేయాల్సి ఉంది.

ప్రస్తుతం అమరావతి అంశంపై కూడా జనసేన తలపెట్టిన కవాతు వాయిదా కూడా పడింది. ఢిల్లీ ప్రచారంలో భాగంగానే ఈ కవాతు వాయిదా వేసినట్లు చెప్పుకుంటున్నారు.